-పర్చా శరత్‌కుమార్
తెలుగు సినిమా రంగంలో అతిరథ మహారథులైన కళాకారులు సాంకేతిక నిపుణులు ఒక్కొక్కరూ మననుంచి శాశ్వతంగా దూరమై వారి జ్ఞాపకాలను మనకు మిగులుస్తున్నారు. 2010 విషయానికి వస్తే కొత్త సంవత్సరం ప్రారంభమైన రెండవ రోజే జనవరి 2వ తేదీ సీనియర్ సంగీత దర్శకుడు చక్ర మననుంచి దూరమయ్యారు. చక్ర పూర్తిపేరు చక్రధరరావు. సాలూరి రాజేశ్వరరావు వద్ద ఆ తరువాత, తన చిరకాల మిత్రుడు కృష్ణతో కలిసి కృష్ణ-చక్ర జంటగా మల్లెపూవు చిత్రంనుంచి సంగీతదర్శకుడు చక్రవర్తికి అసిస్టెంట్స్‌గా పనిచేసారు. ఇక అదేనెలలో సీనియర్ నటుడు రఘుపతి వెంక య్య అవార్డు గ్రహీత , సీనియర్ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మరణించారు. ‘జై భేతాళ’ చిత్రం ద్వారా హీరోగా తెరకుపరిచయమై, ఆ తర్వాత హీరో పాత్రకు కావలసిన పర్సనాలిటీ, కంఠం మొదలగు అన్ని అర్హతలు కలిగి వున్నా, దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ సలహాపై హీరోపాత్రల రేసులో నుంచి పక్కకు జరిగి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎస్.వి. రంగారావుకు సమఉజ్జీ అనిపించుకున్న గుమ్మడి నటించిన అనేక చిత్రాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అవార్డులు పొందాయి. యాభై సంవత్సరాల క్రితం విడుదలైన మాయాబజార్ చిత్రం మళ్లీ రంగుల్లో ముస్తాబై విడుల అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రసాద్ లాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన వేయించి మిత్రులందరినీ స్వయంగా ఫోన్ చేసి పిలిచి ఆ సాయంత్రం ఆనందంగా తమ పాత అనుభవాలను ఏకరువుపెట్టి పండగ చేసుకున్న రెండురోజులకే కన్ను మూయడం పరిశ్రమను కలవరపరిచింది.
2010 మొదటి నెల ఇలా విషాదంగా గడిచిందని మరచిపోకముందే ఫిబ్రవరి నెల కూడా పరిశ్రమ మరి కొందరు ప్రముఖులను కోల్పోయింది. నిర్మాత దగ్గుపాటి రామానాయుడు మేనల్లుడు నిర్మాత పెమ్మసాని కిషోర్‌బాబు దూరమయ్యారు. కిషోర్‌బాబు హీరో జగపతిబాబుతో ధమ్ శ్రీకాంత్‌తో నగరంతోపాటు పలు డబ్బింగ్ చిత్రాలను నిర్మించారు. నటుడు కృష్ణంరాజు సోదరుడు హీరో ప్రభాస్ తండ్రి , స్వయంగా నిర్మాత అయన యు.సూర్యనారాయణరాజు కూడా ఫిబ్రవరిలోనే కన్నుమూసారు. సూర్యనారాయరాజు భక్తకన్నప్ప, అమరదీపం, తాండ్రపాపారాయుడు, బిల్లా, ప్రాణస్నేహితులు లాంటి చిత్రాలను నిర్మించారు. ఫిబ్రవరి నెల అంతటితో తృప్తి చెందక ప్రముఖ హాస్యనటుడు నిర్మాత దర్శకుడు బసవరాజు పద్మనాభంను కూడా తనవెంట తీసుకుపోయింది. గాయకుడిగా స్థిరపడదామని మద్రాసు చేరుకున్న పద్మనాభం నటి కన్నాంబ సహకారంతో హాస్యనటుడై ఆ తర్వాత ఎన్‌టిఆర్ సావిత్రిలతో దేవత, తానే హీరోగా పొట్టిప్లీడరు, శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రాలు నిర్మించారు. శ్రీరామకథ, కధానాయిక మొల్ల, జాతకరత్నం మిడతంభొట్లు, మాంగల్యభాగ్యం చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు. పెళ్లికాని తండ్రి, మా ఇంటిదేవత బయటి బ్యానర్లకు దర్శకత్వం వహించారు. కధానాయిక మొల్ల చిత్రం రాష్ట్రప్రభుత్వ బంగారు నంది అవార్డు గెలుచుకుంది. తెలుగు హాస్యనటులలో ఎక్కువ చిత్రాలను నిర్మించడమే కాకుండా ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక హాస్యనటుడు పద్మనాభం.
ఆ తర్వాత కొంతకాలం గడిచాక నిర్మాత కుదరవల్లి బెనర్జీని పరిశ్రమ కోల్పోయింది. బెనర్జీ తెలుగులో ఆర్తనాదం, ముత్యమంత ముద్దు, డాన్స్‌మాస్టర్ చిత్రాలను నిర్మించారు. చిరంజీవితో పలు హిట్ చిత్రాలను నిర్మించిన కె.ఎస్.రామారావుకు బెనర్జీ స్వయానా తమ్ముడు. ఆ తర్వాత కాలంలో నటి సుహాసినిని సినిమా రంగానికి పరిచయం చేస్తూ కొత్త జీవితాలు చిత్రం నిర్మించిన రావుల అంకయ్యగౌడ్ మృతి చెందారు. తెలుగు సినిమా సాహిత్యంలో విలువలు దిగజారుతున్న సమయంలో తెలుగు పాటకు పట్టు పావడా కట్టబెట్టి, విలువలు పెంచిన మహారచయిత వేటూరి సుందరరామమూర్తిని కూడా 2010 తీసుకెళ్లిపోయంది. తెలుగు సినిమా పాటలలో సవ్యసాచిలా వెలుగొందిన వేటూరి జర్నలిస్టుగా రచనా జీవితం ప్రారంభించి ఓ సీతకథ ద్వారా గేయ రచయితగా సినీ జీవితంలోకి అడుగిడి నవరసాలు నిండిన అనేక పాటలు అందించారు. దాదాపు తొమ్మిది నంది అవార్డులను తన పాటల ద్వారా గెలుపొంది రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే (మాతృదేవత) పాట ద్వారా జాతీయ అవార్డు పొందారు.
ప్రబోధాత్మక గీతాలు రాయాలంటే తనకు తానే సాటి అనిపించుకున్న డాక్టర్ నెల్లుట్ల 2010లోనే కన్ను మూసారు. ముఖ్యంగా ‘ఈ చరిత్ర ఏ సిరాతో‘ ‘ఈ పిల్లకు పెళ్లవుతుందా’, ‘ఈ చదువులు మాకొద్దు’ మొదలగు చిత్రాలకు ఆయన పలు సందేశాత్మక గీతాలు రాసారు. మరో యువ రచయిత సాయిశ్రీహర్ష కూడా ఈ సంవత్సరంలోనే కన్నుమూసారు. శ్రీహర్ష మోహన్‌బాబు నిర్మించిన చిత్రాలకు పాటలు రాసారు. ముఖ్యం గా పెదరాయుడు చిత్రంలోని ‘కదిలే కాలమా ఆగవమ్మా’ సూపర్ హిట్టయ రచయితకుమంచి పేరు తెచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రా రంభించిన బి.ఎన్.రెడ్డి, జా తీయ అవార్డు గ్రహీత, నటు డు, నిర్మాత, దర్శకుడు వామపక్షాల భావాలుగల కె.బి. తిలక్‌ను కూడా ఈ సంవత్సరంలో కోల్పోయాం. ముద్దుబిడ్డ, ఎంఎల్‌ఎ, అత్తా ఒకింటి కోడలే, భూమికోసం, కొల్లేటి కాపురం, ఈడుజోడు, ఉయ్యాల జంపాల లాంటి చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు. వ్యాపారాత్మక సూత్రాలను పక్కనపెట్టి సందేశాత్మక చిత్రాలను నిర్మించి తిలక్ నగ్నసత్యం, ఆలయం చిత్రాలలో ముఖ్యపాత్రలలో నటించారు. కె.బి.తిలక్ స్వయానా ఎల్‌వి ప్రసాద్‌కు మేనల్లుడు.
తెలుగు సినిమాలో అజాతశత్రువుగా కీర్తించబడి ఒక పెద్దదిక్కుగా ఉంటూ పరిశ్రమ వర్గాల్లో ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ముందుకు వచ్చే సీనియర్ డివిఎస్ రాజు కూడా ఈ ఏడాదే మరణించారు. ఎన్‌టిరామారావుకు అత్యంత సన్నిహితుడుగా వారి స్వంత నిర్మాణ సంస్థ ఎన్‌ఏటిలో భాగస్వామిగా పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు, జయసింహ, పాండురంగ మహాత్యం, సీతారామకల్యాణం మొదలగు చిత్రాల నిర్మాణంలో తనవంతు సహాయ సహకారాలు అందించి ఆతర్వాత ప్రగతి సంస్థ ద్వారా అక్కినేని సావిత్రిలతో తెలుగు తమిళ భాషలలో ‘మాబాబు’ చిత్రం నిర్మించి స్వంతంగా డివిఎస్ ప్రొడక్షన్స్‌ను స్థాపించి మంగమ్మ శథం, పిడుగురాముడు, గండికోట రహస్యం, చిన్ననాటి స్నేహితులు, ధనమా దైవమా, జీవనజ్యోతి, జీవితనౌక, ప్రెసిడెంట్ పేరమ్మ, చాణక్య శపథం, భానుమతిగారి మొగుడు లాంటి అనేక చిత్రాల నిర్మాతగా దక్షిణ భారత వాణిజ్యమండలి కార్యదర్శిగా చైర్మన్‌గా జాతీయ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్ చైర్మన్‌గా పరిశ్రమకు సేవలందించారు. మరో సినీయర్ దర్శకుడు పి.వి.రామారావు నవంబర్ నెలలో మరణించారు. రామారావు అంజలీదేవి అక్కినేని నటించిన భక్తజయదేవ చిత్రానికి దర్శకుడు, ఆ తర్వాత శోభన్‌బాబు రాజశ్రీ నటించిన సత్యమేజయం (1967) చిత్రాల దర్శకుడు. అగ్రశ్రేణి నిర్మాతగా పలు బాక్సాఫీస్ హిట్ చిత్రాలను నిర్మించిన కనక మేడల దేవీవరప్రసాద్ కూడా డిసెంబర్‌లో మృతి చెందారు. దేవివరప్రసాద్ తండ్రి చిత్ర పంపిణీ రంగంలో అనుభవంతో ఎన్‌టిఆర్‌తో శ్రీకృష్ణావతారం చిత్రాన్ని నిర్మించారు. పైన పేర్కొన్న ప్రముఖులే కాక డిసెంబర్ 12న ప్రముఖ ఛాయాగ్రాహకుడు, నిర్మాత, దర్శకుడు స్టూడియో అధినేత (విక్రం స్టుడియో) బి.ఎస్.రంగా మృతి చెందారు. రంగాపూర్తి పేరు బిందిగనవాలే శ్రీనివాస అయ్యంగర్‌రంగా. మరణించే సమయానికి ఆయన వయసు 93 సంవత్సరాలు. అక్కినేనికి అఖండ ఖ్యాతి తెచ్చిపెట్టిన లైలా మజ్ను, దేవదాసు (తెలుగు, తమిళం) చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసారు. ఇందరు లబ్ధప్రతిష్టులైన తెలుగు సినీ ప్రముఖులను తనతో తీసుకుని వెడుతున్న 2010 ఒక చేదు జ్ఞాపకాల సంవత్సరంగా తెలుగు హృదయాలలో మిగిలిపోతుంది. పోయినోళ్లందరూ మంచోళ్లు అనుకుంటూ వారి జ్ఞాపకాలను తీపి గురుతులుగా మిగుల్చుకుందాం.

No comments:
Post a Comment