Wednesday, January 12, 2011
కధానాయకుడు 'డా;యం: మోహన్ బాబు
మూడు దశాబ్దాల మోహన్‌బాబు నిర్మాణ సంస్థ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డా.మోహన్‌బాబుది ప్రత్యేకమైన బాణీ. నటనలో విలక్షణత ఆయన ప్రత్యేకత. ఒడిదుడుకులతో ప్రారంభమైన సినీ జీవితం సాఫీగా మారి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన తరువాత విలన్ అయ్యారు, కామెడీ విలన్‌గా నటించారు, మళ్లీ హీరోగా మారిన ఆయన ప్రస్తుతం హీరోగానే కొనసాగుతున్నారు. నటుడుగా 500 చిత్రాల్లో నటించి, నిర్మాతగా 56 సినిమాలు నిర్మించిన మోహన్‌బాబు గురించి, ఆయన విలక్షణ వ్యక్తిత్వం గురించి ఎంతయినా చెప్పవచ్చు. అయితే ఈ రోజున ఆయన గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అంశం ఒకటుంది.
అదేమిటంటే.. 'స్వర్గం-నరకం' చిత్రంతో నటుడిగా ఆయనకు సినీ జన్మ ప్రసాదించిన డాక్టర్ దాసరి నారాయణరావు 'కేటుగాడు' సినిమాతో సోలో హీరోని చేశారు. ఆ సినిమా తరువాత ఇక హీరోగానే కొనసాగాలనే సంకల్పంతో ఆరు నెలల పాటు ఏ ఆఫర్లు అంగీకరించకుండా సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ను నెలకొల్పి, తొలి సారిగా 'ప్రతిజ్ఙ' చిత్రం నిర్మించారు మోహన్‌బాబు. ఆ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 30 ఏళ్లు.
ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు.... ఆర్టిస్టు అయిన ఏడేళ్లకే సొంతంగా చిత్ర నిర్మాణసంస్థను నెలకొల్పడం నిజంగా ఆ రోజుల్లో ఒక సాహసమే. అందుకే ఈ విషయమై తన గురువు దాసరిని కలిసి ఆయన సలహా అడిగారు మోహన్‌బాబు. 'ఆరి ్టస్ట్‌గా బిజీగా ఉన్నావు.. పేరు తెచ్చుకుంటున్నావు.. ఇలాంటి సమయంలో నీకు చిత్రనిర్మాణం అవసరమా?' అని ఆయన అన్నారు.
అయితే పక్కనే ఉన్న దాసరి పద్మ మాత్రం దానికి అంగీకరించలేదు. 'నీకెందుకు నేనున్నాను.. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి.. ఆల్ ది బెస్ట్' అని ఆవిడ ప్రోత్సహించడంతో ముందడుగు వేశారు మోహన్‌బాబు. ఆ రోజుల్లో ఎం.డి. సుందరం ప్రముఖ కథార చయిత. కన్నడంలో, తమిళంలో చాలా చిత్రాలకు కథలు అందించారు. తెలుగులో కూడా కొన్ని చిత్రాలకు కథారచయితగా పనిచేశారు. ఆయన చెప్పిన ఓ కథ మోహన్‌బాబుకి బాగా నచ్చడంతో దాన్ని సినిమాగా తీయడానికి నిర్ణయించుకున్నారు. అప్పటికి దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనలైజ్ అవలేదు.
ఆ తరుణంలో ఆర్టిస్ట్ ప్రభాకరరెడ్డి దర్శకుడు బోయిన సుబ్బారావు పేరు సజెస్ట్ చేసి, ' నీ టెంపర్‌మెంట్‌కి తగిన దర్శకుడతను' అని చెప్పడంతో తన సినిమా దర్శకత్వ బాధ్యతలు ఆయనకి అప్పగించారు మోహన్‌బాబు. హీరోయిన్‌గా కవితను, మిగిలిన పాత్రలకు సత్యనారాయణ, గిరిబాబు, త్యాగరాజు, సాక్షి రంగారావు తదితరుల్ని ఎంపిక చేసి షూటింగ్‌కు ప్రొసీడ్ అయ్యారు. టెక్నీషియన్ల విషయంలో కూడా రాజీ పడకుండా ఆ నాడు అగ్ర స్థానంలో ఉన్న సంగీత దర్శకుడు సత్యంను, ఛాయాగ్రాహకుడు పుష్పాల గోపీకృష్ణని, ఎడిటర్ కె.ఎ.మార్తాండ్‌ని ఎన్నుకొన్నారు.
ఎన్టీఆర్ ఆశీస్సులు చెన్నయ్ వాహినీ స్టూడియోలో ఉదయం ఏడు గంటలకు జరిగిన పాటల రికార్డింగ్‌కు ఎన్టీఆర్ హాజరై ఆశీస్సులు అందచేశారు. ఆ రోజు చెన్నయ్‌కి దూరంగా ఓ లొకేషన్‌లో 'బొబ్బిలిపులి' షూటింగ్ ఉంది. అందుకే మేకప్‌తో అక్కడి వెళుతూ మార్గ మధ్యంలో మోహన్‌బాబు రికార్డింగ్‌కు ఎన్టీఆర్ హాజరై కొబ్బరి కాయ కొట్టారు. 'ఈ సినిమా హిట్ అవుతుంది.. నువ్వు పెద్ద హీరోవవుతావు' అని ఆశీర్వదించారు. దాసరి పద్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక 'ప్రతిజ్ఞ' చిత్రం షూటింగ్ తిరుపతికి సమీపంలో ఉన్న కొటాల గ్రామంలో ప్రారంభమైంది. అప్పట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కెమెరా స్విచాన్ చేయగా, దాసరి పద్మ క్లాప్ ఇచ్చారు.
27 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. సినిమా తొలి కాపీ వచ్చిన తరువాత హీరో కృష్ణ తల్లితండ్రులకు సినిమా చూపించి అభిప్రాయం అడిగారు మోహన్‌బాబు. సినిమా బాగుందని వాళ్లు మంచి రిపోర్ట్ ఇచ్చారు. మంచి టాక్ స్ప్రెడ్ కావడంతో వైజాగ్ ప్రాంతానికి చెందిన ధనరెడ్డి అనే ఆయన సినిమా కొని రాష్ట్రమంతా విడుదల చేశారు. ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఐదు కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది. చెన్నయ్ మ్యూజిక్ అకాడెమీ హాలులో జరిగిన శతదినోత్సవానికి అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, దాసరి నారాయణరావు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
అలా 30 ఏళ్ల క్రితం నిర్మాతగా కూడా తన ప్రస్థానం ప్రారంభించిన మోహన్‌బాబు ఇంతవరకూ 56 చిత్రాలు నిర్మించి శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థ ను ఉన్నత స్థానంలో నిలబెట్టారు. ఈ సంస్థ నిర్మిస్తున్న మూడు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్నాయి.

Monday, January 10, 2011
Subscribe to:
Posts (Atom)