Saturday, April 28, 2012
నూరేళ్ళ భారతీయ చలన చిత్రం విశేషాలు
హైదరాబాదులో మూకీ చిత్రాలు
ఏప్రిల్ 29 నాటి ఆదివారం ఆంధ్రజ్యోతిలో 'వందేళ్ల సినిమా మొదలైందిలా ...' అన్న శీర్షికన వచ్చిన వ్యాసానికి స్పందన ఇది.
మూకీల కాలంలో తెలుగువారంతా ఒక్కటిగా లేరు. నిజాం రాష్ట్రంలో, మద్రాసులో పరిస్థితులు ఒకేలాగ లేవు గనుక ఎక్కడికక్కడ విడి విడిగా ఈ విషయాలను చూడాలి. నిజానికి రఘుపతివెంకయ్య నాయుడు మద్రాసులో మూకీలు తీయకమునుపు 1908 ప్రాంతంలో విదేశీ మూకీల ప్రదర్శన చేసినట్లు చెప్పుకుంటారు. అందుకు ఆయన తెలుగు సినిమా పితామహుడైపోయాడు కాని ... సరిగ్గా అదే కాలంలో కరీంనగర్ వాసి బాబూ పి.ఎస్. (పి.బాబూ సింగ్) 'ఇంపీరియల్ బయస్కోప్ కంపెనీ' పేరున తెలంగాణ అంతటా మూకీ సినిమాలు ప్రదర్శించి చూపించిన విషయం సినీ చరిత్రకారులు చరిత్ర కెక్కించనే లేదు. మరి ఈ బాబూ పి.ఎస్. ను తెలంగాణ చలనచిత్ర పితామహుడిగా ప్రస్తావించుకోవలసిన అవసరాన్ని ఈ తరం వారైనా అంగీకరించాలి. ఇంతకూ ఈ బాబూ పి.ఎస్. ఎవరో తెలుసా? 1935లో వచ్చిన 'శ్రీకృష్ణతులాభారం'లో కృష్ణుడుగా నటించిన పి.జైసింగ్ తండ్రి.
మరోవైపు 1908లో హైదరాబాదులో మూసీనదికి భారీ వరదలు వచ్చి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. ఆ దృశ్యాలను చిత్రీకరించడానికి ఓ కెమెరాతో కలకత్తా నుండి వచ్చినవాడు జె.ఎఫ్. మదన్. ఈ రకంగా చూస్తే మద్రాసు కన్నా ముందే హైదరాబాదులో మూవీ కెమెరాతో చిత్రీకరణ జరిగిందనే విషయం రుజువవుతున్నది. ఈ పరిచయంతోనే జె.ఎఫ్. మదన్ నిజాం కోరిక మేరకు చిత్రకారుడు, రచయిత, నటుడూ అయిన ధీరేన్ గంగూలీని 1918లో కలకత్తా నుండి హైదరాబాదులోని నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌గా ఎంపిక చేసి పంపాడు. విద్యా బోధనకన్నా కళలపట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్న ధీరేన్‌ను తిరిగి కలకత్తా రప్పించుకుని కొంతకాలం తనవద్ద సహాయకునిగా నియమించుకుని కెమెరా నిర్వహణలో శిక్షణ నిచ్చాడు. అప్పటికే భారతదేశం అంతటా మూకీల నిర్మాణం పుంజుకుంటున్నది. ఇది గమనించిన నిజాం నవాబు హైదరాబాదులో సినిమాలు తీసిపెట్టడానికి ఎవరైనా మంచి సాంకేతిక నిపుణుడ్ని పంపమని మళ్లీ జె.ఎఫ్.మదన్‌కే కబురు చేశాడు. అప్పటికే తన వద్ద ఉన్న ధీరేన్ గంగూలీనే హైదరాబాదులో మూకీలు తీయడానికి పంపాడాయన. ఇది జరిగింది 1921లో.
1922లో లోటస్ ఫిలిం కంపెనీ (దక్కన్) సంస్థను నెలకొల్పి మూకీ సినిమా నిర్మాణం ప్రారంభించారు ధీరేన్. ఈ బ్యానర్‌పై ఆయన నిర్మించిన చిత్రాలు ఆరు. వాటి వివరాలు ఇవి - 'చింతామణి' (21.7.1922), 'ఇంద్రజిత్' (1922 - నటీనటులు ధీరేన్ గంగూలీ, సీతాదేవి), 'మేరేజ్ టానిక్' (1922 - ధీరేన్ గంగూలీ, సీతాదేవి - కామెడి), 'సాధూకీ సైతాన్' (1922 - ధీరేన్, లీలా వాలైంటేన్, సుశీలాదేవి - కామెడి), 'ది లేడీ టీచర్' (21. 7. 1922 - ధీరేన్, సీతాదేవి - కామెడి), 'స్టెప్ మదర్' (1923 - ధీరేన్, సీతాదేవి, జోయ్ బెల్లే), 'యాయాతీ' (4.4.1923 - ధీరేన్, సీతాదేవి), 'హరగౌరి' (5.1.1923 - పౌరాణికం). ఈ మూకీలన్నీ హైదరాబాదులో ఆయనే నిర్మించిన రెండు థియేటర్లలో ప్రదర్శితమైనవి. కాగా 1924లో తీసిన 'రజియాబేగం'లో స్థానిక ముస్లింల మనోభావాలు దెబ్బతినే దృశ్యాలున్నాయని నిజాం ప్రభువు ఆగ్రహానికి గురై ఇరవైనాలుగు గంటల్లో హైదరాబాదు విడిచివెళ్లాలని ధీరేన్‌ను ఆదేశించడంతో చేసేదేమీ లేక ఆయన కలకత్తాకు వెనుదిరిగాడు. అదెలాగున్నా తెలంగాణ సినిమాకు బాబు పి.ఎస్. ఆద్యుడైతే, మూకీ యుగంలోనే దాని వికాసానికి దోహదపడిన వాడు ధీరేన్ గంగూలి. మూకీ యుగంలో సినిమాల అభివృద్ధికి పాటుపడినందుకే ధీరేన్‌కు 1975లో దాదాఫాల్కే అవార్డు వచ్చింది.
మళ్లీ 1929లో సికిందరాబాదులో 'మహావీర్ ఫోటోప్లేస్' అనే చిత్ర నిర్మాణ సంస్థ ఏర్పడి అదే సంవత్సరం 'ఫాదర్స్ లవ్ ' (పితృప్రేమ) తీసింది. హరిలాల్‌భట్ దర్శకత్వం వహించిన ఈ మూకీలో మిస్.మణి, మిస్ గాబీహిల్, వై.ఎల్. చిచేన్కర్, ఎస్.పి.నిషాడ్కర్, మాస్టర్ మదన్‌లాల్ నటించారు. 1930లో మణి, మాస్టర్ శంకర్ నటించిన 'ఎ ప్రిన్స్ ఆఫ్ పీపుల్' (రాజధర్మ), 'యాన్ ఐడియల్ ఉమెన్', హరిలాల్ భట్ దర్శకత్వంలో 'అవరైస్' మూకీలు తీశారు. 1931లో వీరే హరిలాల్‌భట్ డైరెక్షన్‌లో కేకే అద్జానియా, మణి, పారోనాగ్ నటించిన యాక్షన్ చిత్రం 'బ్లాక్ ఈగిల్', వి.కె. పాట్ని దర్శకత్వంలో ఎం. శంకర్, మణి నటించిన సాంఘిక చిత్రం 'కిడ్నాప్‌డ్ బ్రైడ్', చున్నిలాల్ పారేఖ్ దర్శకత్వంలో ప్రభాదేవి, శంకర్, శాంతారామ్ నటించిన 'నిర్దర్‌నిరు' చిత్రాలు నిర్మించారు. కాగా 1931లో వీరే మహావీర్ ఫోటో ప్లేస్ అండ్ థియేటర్స్ సంస్థ తరపున హరిలాల్ భట్ దర్శకత్వంలో శంకర్, మణి నటించిన 'సరోజ్ కుమారి' తీశారు.
ఇవిలా ఉండగా 1931లోనే నేషనల్ ఫిలిం కంపెనీ (దక్కన్) అనే మరో చిత్ర నిర్మాణసంస్థ హైదరాబాదులో ఏర్పడి మూకీల నిర్మాణం ప్రారంభించింది. ఈ సంస్థ రెండేళ్లలో నాలుగు మూకీలు తీసింది. అవి చున్నిలాల్ పారేఖ్ దర్శకత్వంలో 'పీకో ఆఫ్ ది వైల్డ్స్' (1931) కె.టి. భావే దర్శకత్వంలో 'పీస్ ఆఫ్ ఈరాక్' (1931), ఇంకా 'దేశబంధు' (1932 - ఈ చిత్ర దర్శకుడు ఎవరో తెలియదు గానీ మంజు అనే పేరుతో హెరాల్డ్ లివీస్ అనే విదేశీ వనిత నటించింది). తరువాత కె.టి. భావే దర్శకత్వంలో 'మేరీమా' (1932) చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో వసంత, విలిమా గార్బో నటించారు.
ఇలా మూకీయుగంలో హైదరాబాదులో 20 చిత్రాలు తయారైతే మద్రాసులో 42 మూకీలు తయారైనవి. ఈ కాలంలో మద్రాసునుండి ఇక్కడికి వచ్చి మూకీలు తీసినట్లుగాని, ఇక్కడ వారు అక్కడికి వెళ్లినట్టుగాని ఎలాంటి దాఖలాలు లేవు. పైగా ఇక్కడ ఏర్పడిన నిర్మాణ సంస్థలన్నీ హైదరాబాదు ప్రాంతానికి చెందినట్లు విడిగా 'దక్కన్' అని రాసుకున్నవి. కనుక మూకీల చరిత్రలో హైదరాబాదులో జరిగిన చిత్ర నిర్మాణం గురించి తెలంగాణ సినీ చరిత్రలో భాగంగా చూడాలి తప్ప మద్రాసులో జరిగిన అంశాలతో ముడిపెట్టకూడదు. ఎందుకంటే మద్రాసుతో సమాంతరంగా హైదరాబాదులో మూకీల చిత్ర నిర్మాణం జరిగింది కనుక.

Friday, April 27, 2012
తారాచౌదరి వివాదం
గుట్టు బయటపెడతా
ఎంపీ, ఎమ్మెల్యే, డీజీ, డీఎస్పీ, సీఐ వేధించారు
నాతో లేనిపోనివి చెప్పించి రికార్డు చేశారు
ఎంపీ నాతో పలుమార్లు అసభ్యంగా మాట్లాడారు
ఎమ్మెల్యే నా కుటుంబ సభ్యులను వేధించారు
ఏసీపీ శంకర్‌రెడ్డి నా పాలిట యముడు
లక్ష్మీ పార్వతి విలన్‌లా, రాక్షసిలా బెదిరించింది
ఎంత దూరమైనా వెళ్తా.. అందరినీ బయటపెడతా
'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో తారా చౌదరి

హైదరాబాద్, జూలై 8 : రావెళ్ల రాజేశ్వరి.. అలియాస్ తారా చౌదరి. సినిమాల్లో నటించాలని హైదరాబాద్‌కు వచ్చి, కొందరి చేతుల్లో మోసపోయింది. చివరకు సెక్స్‌రాకెట్ నిర్వాహకురాలిగా ఆమె బోనెక్కితే, సూత్రధారులు, లబ్ధిదారులు మాత్రం చల్లగా జారుకున్నారు. ఆ తేలుకుట్టిన దొంగల భరతం పట్టడానికే ఏబీఎన్ స్టూడియోకు వచ్చానంటున్న తారాచౌదరితో.. 'ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే' విశేషాలు.
నమస్కారం తారాచౌదరిగారూ. అసలు తారా చౌదరి అనే పేరు ఎలా వచ్చింది?
2005లో సినీపరిశ్రమ కోసం హైదరాబాద్ వచ్చాను. అప్పుడు పరిశ్రమలో చౌదరీల డామినేషన్ ఉందని విన్నాను. కొందరు దర్శకులు, నిర్మాతలను కలిశాను. వాళ్లు సరదాగా తార-సితార అనేవారు. అలా నాకు తార అనే పేరు స్థిరపడిపోయింది.
ఇప్పుడు రాష్ట్రంలో తారాచౌదరి అంటే తెలియనివాళ్లు లేరు. ఏమనిపిస్తోంది?
నన్ను కావాలని ఇరికించారు. నాకు సినిమాలు, రాజకీయాలు, సమాజసేవ అంటే ఇష్టం. తర్వాత ఇక్కడకొచ్చాక పరిస్థితులు చూసి నటన మానుకుందాం అనుకున్నాక ఒక కోఆర్డినేటర్ వచ్చి చిన్నికృష్ణ వద్దకు తీసుకెళ్లారు. అది ప్లాన్ అని తర్వాత తెలిసింది. 2007లో చిన్నికృష్ణతో నాకు గొడవలయ్యాయి. అందుకు సూత్రధారి ఏసీపీ శంకర్‌రెడ్డి అని ముందు తెలీదు. తర్వాత తెలిసింది. చిన్నికృష్ణకు నలుగురైదుగురు భార్యలున్నారు.
శంకర్‌రెడ్డితో మీకు ఎలా పరిచయం?
మొదట్లో నేను మాదాపూర్‌లో ఉండేదాన్ని. అప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్లను మాదాపూర్ పోలీసులు పట్టుకుని, నా వస్తువులు నాకు రికవరీ చేసిచ్చారు. తర్వాత శంకర్‌రెడ్డి (అప్పటికి సీఐ) నాకు ఫోన్ చేసి 'నువ్వు ఆర్టిస్ట్ అంట గదా, చాన్సులిప్పిస్తా' అంటూ వల్గర్‌గా మాట్లాడేవాడు. దాంతో నేను ఉన్నతాధికారికి చెబుదామని బంజారాహిల్స్ పీఎస్‌కు ఫోన్ చేస్తే, ఈ శంకర్‌రెడ్డే కలగజేసుకుని నా ఇంటికి పోలీసులను పంపాడు. (అప్పుడే నామీద బ్రోతల్ కేసు పెట్టారు.) దాంతో నేను ఫైరయ్యాను.
అసలు చిన్నికృష్ణతో లింక్ ఎలా వచ్చింది?
శంకర్‌రెడ్డి నామీద కేసు పెట్టాక, 2007లో చిన్నికృష్ణ సినిమా స్టార్ట్ చేస్తున్నాడని ఒక సినీ కోఆర్డినేటర్ నా దగ్గరకొచ్చాడు. సెకండ్ హీరోయిన్ కేరెక్టర్ ఇస్తామన్నారు. అక్కడే శంకర్‌రెడ్డిని చూశాను. చిన్నీని ప్రశ్నిస్తే మంచి ఫ్రెండని చెప్పాడు. తర్వాత ఇద్దరూ కలిసి రూంలో కూర్చుని నన్ను పిలిచారు. 'అప్పుడు నేను చెప్పినట్లు వినలేదు, కేసు పెట్టాను. ఇప్పుడు విను, సినిమాచాన్స్ వస్తుంది.. పైకొస్తావు' అన్నాడు. కొన్నాళ్లకు.. తాము చెప్పినట్లు వినకపోతే చంపేస్తామని నన్ను బెదిరించారు. చిన్నికృష్ణ కూడా వల్గర్‌గా మాట్లాడేవారు. సినిమా వేషాల కోసం వచ్చినవారిని నాయకుల వద్దకు పంపేవారు. దీని గురించి రామానాయుడు గారితో చెప్పాను. నచ్చకపోతే బయటకు వెళ్లిపో అన్నారు.
అప్పటివరకు ఎవరితోనూ మీకు శారీరక సంబంధాలు ఏర్పడలేదా?
అసలు మా కుటుంబం అలాంటిది కాదు. అతని భార్య చనిపోయిందని గోడమీద ఫొటో చూపించాడు. నన్ను లోబరుచుకోడానికి ప్రయత్నించాడు. కూల్‌డ్రింక్‌లో ఏదో కలిపి ఇచ్చాడు. అది తాగి, వాంతులై పడిపోయాను. తర్వాతిరోజు పొద్దున్న నాకు మెలకువ వచ్చింది. పనిమనిషిని అడిగితే.. చిన్నికృష్ణ, శంకర్‌రెడ్డి కలిసి ఏదో కెమెరానో సెల్‌ఫోనో పట్టుకుని రూంలోకి వచ్చారంది. తర్వాత నేను కస్టడీకి వెళ్లినప్పుడు 'చిన్నికృష్ణ ఇంట్లో నీ ఫొటోలివిగో' అని శంకర్‌రెడ్డి చూపిస్తే షాకయ్యాను.
మీరు సెక్స్‌రాకెట్ నిర్వహిస్తున్నారని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్‌లు మీ కస్టమర్లని.. వాళ్ల సంభాషణలు, అవీ ఇవీ మీరు వీడియో తీసి బెదిరించారని పోలీసులు చేసిన ప్రధాన ఆరోపణ. అది వాస్తవమా.. కాదా?
పచ్చి అబద్ధం. నాకు సినిమాలు, రాజకీయాలంటే ఇష్టం. దాంతో నేను హైదరాబాద్ వచ్చి, రెండు మూడు సినిమాలు చేశాను. నాకు అచ్చిరాదనిపించి శ్రీ తార ఆర్ట్స్ అని ఓ బ్యానర్ రిజిస్టర్ చేసుకున్నాను. దాని మీద చిన్న సినిమా అయినా తీయాలని అనుకున్నాను. నా దగ్గర చిన్న ఎమౌంట్ ఉన్నా ఎవరికైనా సాయం కావాలంటే చేస్తుంటాను.
అంటే, పోలీసులు చెప్పింది వాస్తవం కాదా?
వాళ్లు చెప్పింది, చేసిందంతా ఫ్రాడ్. శంకర్‌రెడ్డి నా పాలిట యముడిలా దాపురించాడు. లక్ష్మి అనే ఓ అమ్మాయిని పురమాయించాడు. ఓ రోజు ఆ అమ్మాయి ముఖానికి గుడ్డ కట్టుకుని టీవీలో ఏదో చెబుతోంది. దాంతో బంజారాహిల్స్ పీఎస్‌కి వెళ్లాను. అక్కడ కానిస్టేబుళ్లు, సీఐలు నా దగ్గరున్న మూడు సెల్‌ఫోన్లు లాక్కున్నారు. అందులో నా సినిమా ఫ్రెండ్లు, నాకు పరిచయమైన కొందరు నాయకుల నెంబర్లు ఉన్నాయి. వాళ్లను బ్లాక్‌మెయిల్ చేయాలని అనుకున్నారు. నా ఫోన్‌లో ఓ చానల్ రిపోర్టర్ మురళి నెంబర్ ఉంది. ఆయన మొదట్లో అతి మంచితనం ప్రదర్శించి, లైవ్ ఇప్పించి, ఇంటర్వ్యూలు తీసుకున్నారు. తర్వాత చుట్టుపక్కల అందరినీ కట్‌చేసి, నన్ను బ్లేమ్ చేయడానికి సోలోగా ఉన్నవి ప్లేచేశారు. పోలీసులు, మురళీ కుమ్మక్కయ్యారు. మురళి అప్పుడప్పుడు నాకు ఎస్ఎంఎస్‌లు పెట్టేవాడు, కాల్స్ చేసేవాడు. వల్గర్‌గా మాట్లాడేవాడు.
మరి అమ్మాయి సంగతేంటి?
ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు. మార్చి 1 నుంచి 15 వరకు బంధించారని చెప్పింది. ఆ టైంలో నేను తిరుపతిలో ఉన్నాను. నాయకులెవరినీ బ్లాక్‌మెయిల్ చేయలేదు. వాళ్లే నాకు ఫోన్లుచేసి అనేక రకాలుగా అసభ్యంగా మాట్లాడారు. మీడియాకు కాల్ రికార్డులు చూపించాను. వాళ్లలో ఎమ్మెల్యే, ఎంపీ, డీజీ, ఎస్పీ, అంతా ఉన్నారు.
ఆ ఎంపీ ఎవరు.. రాయపాటి సాంబశివరావా?
ఆయన రాయపాటా.. ఎవరా అన్నది నేను మొన్న మీడియా చానళ్లన్నింటికీ కాల్‌డేటా చూపించాను. నాతో ఆయనకి పరిచయాలు లేకపోతే, ఆయన గెస్ట్‌హౌస్ నుంచి, ఆయన ఇంటి నుంచి, ఆయన ఢిల్లీ ఆఫీసుల నుంచి, ఆయన పీఏ నుంచి, ఆయన పర్సనల్ మొబైల్ నుంచి.. కాల్స్ ఎలా వస్తాయి? ఎప్పుడెప్పుడు వచ్చాయో బయటపెడతా.
అసలు ఏం జరిగిందో చెప్పండి?
2008లో నేను తిరుపతి వెళ్లాలని లెటర్ కోసం ఆయన్ని కలిశాను. తర్వాత ఆ పరిచయంతో.. నాకు మసాజ్‌లు అంటే ఇష్టం, అమ్మాయిలను పంపు అన్నారు. తెలిసినవాళ్ల నెంబర్లు తీసుకుని.. ఆయనకి మసాజ్ కావాలట, మీరు చేస్తారా అని అడిగాను. వాళ్లు చేస్తామన్నారు. అలా చేసినవాళ్లు నా దగ్గరకొచ్చి రెండు రకాలుగా చెప్పారు. ఒకళ్లు, 'మీరు మసాజ్ అన్నారు, ఆయన ఏదో వల్గర్‌గా ప్రవర్తించారు.. మేం తప్పించుకుని వచ్చాం' అన్నారు. మరికొందరు.. 'మీరు మంచి సార్‌ని పరిచయం చేశారు.. మేం ఒకదానికి వెళ్తే, ఆయన మరోలా ఎక్కువ డబ్బు ఇచ్చారు' అన్నారు. ఎవరిష్టం వాళ్లది.
కన్నా లక్ష్మీనారాయణను అప్రతిష్టపాలు చేయడానికి మీకు డబ్బులిచ్చారని కూడా చెప్పారు కదా? ఏం చేయమన్నారు?
కన్నా లక్ష్మీనారాయణ నాకు తెలీదు, అమ్మాయిలను అడ్డుపెట్టుకుని ఆయనమీద బురద చల్లాల్సిన అవసరం నాకు లేదని చెబితే సరేనన్నారు. ఆ ఎంపీ సోదరుడి కుమారుడు రాత్రి పూట మూడు నాలుగు గంటలు మాట్లాడేవాడు. మీరంటే ఇష్టం, మంచి ఫ్రెండ్‌లా ఉందామని అనేవాడు. చివరకు లవ్ చేస్తున్నానన్నాడు. నేను దాన్ని పట్టించుకోలేదు. తర్వాత ఎంపీ అసభ్యకరంగా మాట్లాడేవారు. అమ్మాయిలను పంపుతున్నావా లేదా.. నువ్వు గెస్ట్‌హౌస్‌కి వచ్చేసెయ్యి అనేవారు. తర్వాతి కాలంలో నాకు మూడ్ వచ్చేసింది అమ్మాయిని పంపించు అన్నప్పుడు.. రికార్డ్ చేశాను.
సమాజం దృష్టిలో మీరు వ్యభిచార వృత్తి నిర్వాహకురాలే కదా?
వ్యభిచార వృత్తి నిర్వాహకురాలినని నన్ను కోర్టు నిర్ధారించలేదు. నిజానికి వ్యభిచారులు వాళ్లు. శంకర్‌రెడ్డి.. వీళ్లంతా బ్రోకర్లు.
మీ దృష్టిలో ఆ వ్యభిచారులు ఎవరు?
ఒకరు రిటైర్డ్ డీజీ. ఆయన పేరు భాస్కరయ్య. నాతో అసభ్యంగా మాట్లాడి, ఏమే.. ఏంటే అన్నారు. అవన్నీ రికార్డుచేశాను. అవన్నీ పోలీసులు తీసుకుని వాళ్లదగ్గర డబ్బులు గుంజుకుని నన్ను బ్లాక్‌మెయిల్ చేశారు. ఈ ఐజీ గానీ, కర్నూలు డీఎస్పీగానీ, ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే గానీ...
ఈ డీఎస్పీ, ఎమ్మెల్యే.. వీళ్లంతా ఎవరు?
కర్నూలు డీఎస్పీ మనోహరరావును భాస్కరయ్య పరిచయం చేశారు. ఎమ్మెల్యే ఆదిలాబాద్ జిల్లా ఆయన.
వీళ్లందరికి సంబంధించిన ఆడియోటేప్‌లు పోలీసులు తీసుకున్నారా?
డీజీపీ గారు గానీ, హోం మంత్రి గానీ, కమిషనర్‌గానీ నేను రక్షణ అడిగినప్పుడు స్పందించలేదు. కారణమేంటి? ఎవరో అమ్మాయి వైజాగ్ నుంచి వచ్చానని, ఆమెను నేను బంధించానని చెబితే ఒక గంగాభవాని గారు, ఒక నన్నపనేని రాజకుమారి గారు, ఒక సంధ్య గారు.. వీళ్లంతా ఆ అమ్మాయి బిత్తరచూపులు చూస్తోందని, వాస్తవాలు చెప్పట్లేదని గమనించకుండానే ఆ అమ్మాయికి న్యాయం చేయాలని అడిగారు.
లాకప్‌లో శంకర్‌రెడ్డి మీ చీర లాగడానికి ప్రయత్నించాడన్నారు. నిజమేనా?
అవును.. శంకర్‌రెడ్డి కస్టడీ పేరుతో నన్ను తీసుకెళ్లి, నా చీర లాగేశాడు. లేడీ కానిస్టేబుళ్లు దేవి, కిరణ్‌కుమారి, ఎస్ఐ సీతారాములు దీనికి ప్రత్యక్ష సాక్షులు. స్టేషన్‌లో తన గదిలో బెడ్‌మీద శంకర్‌రెడ్డి కూర్చుని అసభ్యకరంగా నామీద చేతులేశారు. అదంతా సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించి నాతో బలవంతంగా వేరేలా చెప్పించి రికార్డు చేశారు. కస్టడీ ముగిశాక జడ్జీ వద్ద కూడా నేను ఏడుస్తూ ఇదే చెప్పాను. అంత చెప్పినా డీజీపీగారు ఎందుకు స్పందించలేదు? మిమ్మల్ని రకరకాలుగా ఉపయోగించుకున్న వాళ్లంతా బాగానే ఉన్నారు. మీరు మాత్రం లేడీ విలన్‌గా ముద్రపడిపోయారు. ఎందుకలా? నన్ను బలిపశువును చేసినవాళ్లందరూ వయసులోను, హోదాలోను పండిపోయినవాళ్లు. వాళ్లు తప్పులు చేయని నిజాయితీపరుల్లా బయటకు కనపడుతున్నారు. ప్రభుత్వం నిజాయితీగా స్పందిస్తే.. నన్ను ఇబ్బంది పెట్టినవాళ్లను జైళ్లకు పంపేది.
ఎమ్మెల్యే వేణుగోపాలాచారి విషయం ఏంటి?
గతంలో టీడీపీలో ఉండి ప్రస్తుతం టీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఒకరున్నారు. ఆయన సీఐతో ఫోన్లు చేయించి మా కుటుంబసభ్యులను బెదిరించారు.
రిమాండ్‌లో తోటి ఖైదీలు ఎలా ఉండేవారు? పోలీసుల విషయమేంటి?
ఖైదీలు బాగానే ఉండేవారు. ఓ టీవీ చానల్ వాళ్లు, పోలీసులు కుమ్మక్కు అయ్యి లేనిపోనివి సృష్టించారు. నాకు నార్కోటెస్టులు చేసినా నిజం తెలుస్తుంది. అదే శంకర్‌రెడ్డికి, సుదర్శన్‌కి కూడా చేయాలని అడుగుతున్నా. నన్ను ఎంపీ ఇబ్బంది పెట్టినప్పుడు మాజీ సీఎం భార్యను ఆశ్రయించా. ఆమె ఎవరో కాదు.. లక్ష్మీపార్వతి ఆంటీ. నాకు న్యాయం చేస్తానని చెప్పి, ఆ ఎంపీతో దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తిని పిలిపించింది. తర్వాత ఆయన నా తలమీద చెయ్యేసి, ఆ ఎంపీ అంతేనని.. వదిలెయ్యమని చెప్పారు. ఆమె నా దగ్గర ఉన్న సాక్ష్యాలు ఒక సెట్టు ఇవ్వమని చెబితే ఇచ్చాను. తర్వాతి రోజు ఫోన్ చేసి 'వాళ్ల సంగతి నీకు తెలీదు, ఎత్తుకెళ్లి చంపేస్తారు' అని విలన్‌లా, రాక్షసిలా బెదిరించింది.
ఈ రొచ్చులోంచి బయటికెళ్లి, హైదరాబాద్ వదిలేసి ప్రశాంతంగా బతకాలనుకుంటున్నారా?
నేనెందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలి.. ఇక్కడే ఉంటా. నేనేంటో రుజువు చేసుకుంటా. ఈ శంకర్‌రెడ్డి లాంటి వాళ్లను మాత్రం కఠినంగా శిక్షించాలని కోర్టులోను, హెచ్చార్సీలోను ఫిర్యాదుచేస్తా. ఎంత దూరమైనా వెళ్తా. పోలీసులు నా దగ్గర తీసుకున్నవి జిరాక్సులు మాత్రమే. ఒరిజినల్స్ అన్నీ నా మెయిల్ బాక్సులో ఉన్నాయి. వాళ్ల బండారాన్ని బయటపెట్టి దోషులుగా నిరూపిస్తా. నా కుటుంబాన్ని వేధించిన ఎమ్మెల్యే, అర్ధరాత్రి నాకు ఫోన్లు చేసిన ఎంపీ, డీఎస్పీ, డీజీ.. అందరినీ బయటపెడతా.

Monday, April 23, 2012
Subscribe to:
Posts (Atom)