Thursday, May 24, 2012
Tuesday, May 22, 2012
Sunday, May 20, 2012
నటి 'సుజాత'
జ్ఞాపకాలు
హైలో హైలెస్సా... హంస కదా నా పడవ
'హైలో హైలెస్సా..' అంటూ శంతనుని మనసే గాక ఆంధ్ర ప్రేక్షక లోకాన్నంతా జమునారాణి కంఠం సహాయంతో ఉర్రూతలూగించిన సినీ మత్స్యగంధి సుజాత. సినిమా, నాటకం, గాత్రధారణ...ఈ మూడురంగాల్లోనూ విశేష ప్రతిభ కనబరిచి ప్రేక్షకహృదయాల్లో ఇప్పటికీ 'భీష్మ' సుజాతగా నిలిచిపోయిన నిన్నటితరం సుజాత జ్ఞాపకాలే ఈ వారం.
మా సొంత ఊరు తెనాలి సమీపంలోని చినరావూరు. సూరయ్య, శ్రీమతి వెంకటరత్నమ్మగార్లు నా తల్లిదండ్రులు. మాది మొదటినుంచీ వ్యవసాయకుటుంబమే ! నాకు ఇద్దరు అన్నయ్యలు. వాళ్లకు చెల్లెలు నేనొక్కదాన్నే కావడంతో నన్ను చాలా గారాబంగా చూసుకునేవారు. మా అమ్మ నేను ఒక కళాకారిణిగా ఎదిగితే చూడాలని ఆశపడేది. అందుకే నాకు చిన్నప్పటినుంచీ సంగీతం, నాట్యం నేర్పించారు. ఆ రోజుల్లో ఎం.ఎస్. శైవ అని ఓ నాట్యాచార్యుడు ఉండేవారు. ఆయన దగ్గర నాకు నాట్యశిక్షణ ఇప్పించారు. ఆయన అప్పుడు గుంటూరులో ఉండేవారు. ఆయన దగ్గర కూచిపూడి డాన్సు నేర్చుకున్నాను. నా ఐదవ ఏటనే డాన్సుప్రోగ్రామ్స్ ఇవ్వడం ప్రారంభించాను. నా అసలు పేరు సరోజిని. అయితే తెనాలిలో వి.సాంబశివరావు గారని ఉండేవారు. ఆయన నా నాట్యప్రదర్శనలు చూసి ముగ్ధులై, మా అమ్మానాన్నలతో మాట్లాడి 'బేబీ సుజాత - పార్టీ' అనే పేరుతో ఓ డాన్స్ ట్రూప్ పెట్టి నా పేరు సుజాతగా మార్చారు.
జీతం 300
నా విద్యాభ్యాసం అంతా తెనాలిలోని మునిసిపల్ గర్ల్స్ హైస్కూలులో సాగింది. మేమంతా స్కూలు నాటకాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాళ్లం. ఓ సారి శకుంతల నాటకం వేస్తే అందులో నేను దుష్యంతుడిగా నటించాను. నేను బాగా డాన్సు చేస్తానని పాఠశాలలో నన్ను బాగా చూసుకునేవారు టీచర్లు. నా 11వ ఏటనే నా నృత్యకౌశలాన్ని చూసి నాకు భువనగిరిలో నృత్య ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం ఇచ్చారు. వయసు చాలకపోయినా నెలకు రూ 300 జీతంతో నేను భువనగిరిలో ఉద్యోగం చేశాను. మా అమ్మానాన్నలు నా ఉత్సాహాన్ని చూసి నాతో పాటే అక్కడకు వచ్చేశారు.
నేను తెనాలిలో ఫోర్త్‌ఫారం వరకూ చదువుకున్నాను. ఆ బడిలోనే సరస్వతిగారని ఒక తెలుగు టీచరు ఉండేవారు. ఆమె కూతురికి నేను డాన్సు నేర్పేదాన్ని. ఆమెకు వినోదాసంస్థ అధినేత డి.ఎల్.నారాయణగారు తెలుసు. ఆయన ఆ సమయంలో 'సిపాయి కూతురు' అనే చిత్రాన్ని తీస్తున్నారు. అందులో వాంప్ వేషానికి తగిన యువతి కోసం అన్వేషిస్తూ తెనాలిలో ఎవరైనా ఉంటే చెప్పమని సరస్వతిగారిని అడిగారట. నాకు కూడా చిన్నప్పటినుండీ సినిమాలంటే ఇష్టమే! పైపెచ్చు జమునగారంటే విపరీతమైన ఆరాధన. ఆమె స్టైల్‌ను అనుకరించేదాన్ని. జమునగారిని దగ్గరగా చూడాలని, ఆమెను అక్కా అని పిలవాలని తెగ ఆరాటపడేదాన్ని. సినిమాల్లోకి వస్తే ఆ కోరిక తీరుతుందేమోననే ఆశతో సినిమాలపై మోజుపడ్డాను. కానీ మా నాన్న, అన్నయ్యలు ససేమిరా కాదన్నారు. మా కుటుంబాల్లో తర్జనభర్జనలు జరిగాయి. ఎట్టకేలకు మా అమ్మగారి పట్టుదలతో సినిమాల్లో చేరడానికని చెన్నై వచ్చాం. డి.ఎల్. నారాయణ గారు నన్ను చూసి, 'మరీ చిన్నపిల్ల, మళ్లీ ఎప్పుడైనా చూద్దాంలే' అనేసి, ఆ పాత్రకు ఎల్.విజయలక్ష్మిని తీసుకున్నారు. ఆమెకూ అదే మొదటి సినిమా.
పంటి మీద పన్ను కరిగింది
సరే ఇక ఏంచేద్దాం అని ఆలోచిస్తుండగా నాకు చిన్నతనంలో నాట్యం నేర్పిన ఎం.ఎస్. శైవగారు అప్పుడు చెన్నైకై వచ్చేశారని తెలిసింది. మా అమ్మావాళ్లు ఇంకా బాగా నాట్యం నేర్చుకోమని వారి వద్ద చేర్చారు. సరేనని నేనూ డాన్సు కొనసాగించాను. శైవాగారి దగ్గరకు నాటకాల వాళ్లు, సినిమాల వాళ్లు అప్పుడప్పుడూ వచ్చిపోతుండేవారు. అలా ఓ సారి నాగభూషణం గారు వస్తే, శైవగారు నన్ను వారికి సిఫారసు చేశారు. అలా ఆ నాటకంలో ఇందిర పాత్రకు నన్ను తీసుకున్నారు. ఆ పాత్రను నాకు ముందు శారదగారు వేసేవారు. నా తర్వాత వాణిశ్రీ గారు వేస్తూ వచ్చారు. ఆ నాటకం నాకు మంచిపేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'భక్త అంబరీష '( 1959 )చిత్రంలో ఈలపాటి రఘురామయ్యగారి సరసన శ్రీమహాలక్ష్మీగా, 'దీపావళి'(1960) లో రంభగా 'కన్న కొడుకు' (1961) 'నాగార్జున'(1962)లో సుభద్ర పాత్రను, రాజనాల సరసన నటించాను. ఆ పాత్ర కథానాయక కిందే లెక్క.
ఆ సినిమా తర్వాత బి.ఏ.సుబ్బారావు గారు 'భీష్మ'(1962) లో మత్స్యగంధి పాత్రను వేశాను. ఈ వేషానికి మొదట సత్యవతి(రచయిత అనిసెట్టి సతీమణి) గారిని అనుకున్నారు. కానీ ఏవో కారణాలవల్ల ఆమె విరమించుకుంటే ఆ అవకాశం నాకు లభించింది. అప్పట్లో నాకు పంటిమీద పన్ను ఉండేది. సుబ్బారావుగారు ఆ పళ్లు బాగాలేదని దాన్ని కరిగించేసి, మళ్లీ ఏదో క్యాప్ వేసి చాలా శ్రద్ధ తీసుకున్నారు. హైలో హైలెస్సా పాట నామీద చిత్రీకరించారు. జమునారాణి గారు ప్లేబాక్. ఆంధ్రదేశాన్ని అదరగొట్టేసిందా పాట. ఇప్పటికీ అభిమానులు నన్ను మీరు 'భీష్మ' సుజాత గదా అని గుర్తుపట్టి పలకరిస్తుంటే నాకు చాలా అనందంగా ఉంటుంది. వాలి(ఆర్టు డైరెక్టరు), హరిబాబు(మేకప్‌మాన్) గార్లు చాలా శ్రద్ధతో సత్యవతి పాత్రను రూపొందించారు. అందులో ఎన్.టి.రామారావుగారికి తల్లి పాత్ర నాది. ఆ సినిమా సెట్లోనే ఎన్.టి.రామారావు గారు "సుజాతగారూ! బాగా చేయండి. మంచి వేషం, మంచి పేరొస్తుంది'' అని ఆయన స్టైల్‌లో గంభీరంగా అన్నారు. ఆయన మాటే నిజమయ్యింది. ఆ పాత్ర ఈ నాటికీ తెలుగు సినిమా చరిత్ర పుటలలో నిలిచిపోయేంతగా నాకు మంచి బ్రేక్ ఇచ్చింది.
'షావుకారు' పాఠాలు
'భీష్మ ' చిత్రం నాకు పేరైతే తీసుకువచ్చింది గానీ వెంటనే అవకాశాలు మాత్రం తీసుకురాలేదు. మరి ఖాళీగా ఉండలేం కదా, ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం గారి ట్రూపులో చేరి, 'శ్రీకాళహస్తి మహా త్మ్యం', 'శాంతినివాసం' నాటకాల్లో నటిస్తూ వచ్చాను. అదే విధంగా వల్లం నరసింహారావు, జి.వరలక్ష్మి, శారద మొదలైనవారితో 'మనోహర' నాటకంలో నటించాను. అప్పుడే జి.వరలక్ష్మిగారు నటనలో మెలకువలు ఎన్నో నేర్పారు. సంభాషణలు ఉచ్ఛరించేవిధానం నేర్పారు.
ఇలా నాటకాల్లో బిజీగా ఉన్న రోజుల్లోనే కన్నడ చిత్రసీమలో మంచి అవకాశాలు వచ్చాయి. 'గౌరి' అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించాను. ఈ చిత్రంలో షావుకారుజానకిగారు నాకు తల్లిగా నటించారు. ఆమెతో నటించడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఆమె తీరిక దొరికినప్పుడల్లా 'ఇలా నటించాలి, ఇలా డైలాగ్ చెప్పాలి' అని చెప్పించేవారు. నిజానికి ఆ వయసులో మాకు అవి పాఠాలు లాంటివి. ఇంకా 'సతిశక్తి' 'రణధీర కంఠీరవ' తదితర కన్నడ చిత్రాల్లో నటించాను. తెలుగులో మదనకామరాజు కథ(1962), పరువుప్రతిష్ఠ (1963), బంగారు తిమ్మరాజు(1964) తదితర చిత్రాల్లో నటించాను.
పినిసెట్టి గారి నాటకం 'పంజరంలో పక్షులు' ఆ రోజుల్లో చాలా పాపులర్. ఆ నాటకాన్ని ఓ సారి చెన్నై వాణీమహల్‌లో ప్రదర్శించారు. నేను, మణిమాల అందులో హీరోయిన్లుగా నటించాం. ఇంకా అందులో ఎస్.వి.రంగారావు, శారద, రామకృష్ణ మొదలైన వారంతా నటించారు. ఆ నాటకం చూసిన వి.మధుసూదనరావు 'వీరాభిమన్యు' (1965)లో అవకాశం ఇచ్చారు. మొదట ఆ పాత్రకు వాణిశ్రీగారిని అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఆమె బిజీగా ఉండడంతో నన్ను తీసుకున్నారు. అభిమన్యుడు స్త్రీరూపంలో ఉత్తరను సమీపించే పాత్ర అది. నాకు, కాంచనకు ఆ చిత్రంలో ఒక పాట కూడా ఉంది. ' తాకిన చోట చల్లదనం' అనే పాట అది.
రాజావారి ఆంక్షలు
ఈ 'పంజరంలో పక్షులు' నాటకంలోనే పిఠాపురం రాజావారి మనవడు ఎం.ఎం.కె. అప్పారావు గారు ప్లేబాక్ పాడారు. ఆ నాటక ప్రదర్శనకు పెట్టుబడి కూడా ఆయనదే. ఆయన నాటకంలో నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మా ఇంట్లోవాళ్లు కూడా ఒప్పుకున్నారు. అలా మా పెళ్లి జరిగిపోయింది. ఆ పెళ్లితో నేను నిజంగానే పంజరంలో పక్షినై పోయాను. రాజావారు నన్ను సినిమాలు మానేయమని ఆంక్ష విధించారు. అప్పుడు 'వీరాభిమన్యు' షూటింగ్ జరుగుతోంది. సినిమాలు మానేస్తున్నానని తెలిసి శోభన్‌బాబుగారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమన్నారు. సినిమాలు మానేస్తే చాలా క ష్టాలు పడాల్సి వస్తుందని చాలా దూరం చెప్పిచూశారు. కానీ నేను మానుకోవాలనే నిర్ణయానికొచ్చేశాను అప్పటికే. 'వీరాభిమన్యు' షూటింగ్ అయిపోయిన తర్వాత వాహినీ స్టుడియోలో అందరికీ చెప్పేసి, ఫ్లోర్ నుండి వస్తూ వస్తూ, ఇక సినిమాల్లోకి రాను, ఒక వేళ వచ్చినా ఏ అమ్మ వేషాలకో, బామ్మ వేషాలకో వస్తానేమో' అనుకుంటూ బాధతో వచ్చేశాను.
సినిమాకు ఫుల్‌స్టాప్
పెళ్లితో సినిమా జీవితం పూర్తిగా ముగిసిపోయింది. అంతఃపుర జీవితం, ఘోషా పద్ధతి..ఎవరినీ కలిసేందుకు కూడా వీలుండేది కాదు. నాకేమో ఇంట్లో ఖాళీగా కూర్చోవడం మొదటినుంచీ ఇష్టముండేది కాదు. 1967లో నాకు ఒక కొడుకు పుట్టాడు. బాబుకు ఒకటిన్నర సంవత్సరం వయసు వచ్చాక ఇక అసలు ఇంట్లో ఉండలేకపోయాను. ఎలాగో రాజావారిని ఒప్పించి ప్రాధేయపడి ఆంధ్రమహిళా సభలో బెనారస్ మెట్రిక్‌లో చేరాను. అక్కడే షావుకారి జానకి గారి కూతురు యజ్ఞప్రభ, ప్రముఖ సినీనటి శ్రీవిద్య నాకు క్లాసుమేట్సు. అక్కడ చదువుకుంటున్నపుడే ఓ రోజు షావుకారు జానకి గారు తమ కూతురిని ఇంటికి తీసుకువెళ్లడానికి కాలేజికి వచ్చారు. అక్కడి వాళ్లందరూ సినిమానటి వచ్చిందని ఆవిడ ఆటోగ్రాఫుల కోసం, ఫోటోల కోసం ఎగబడ్డారు. అది చూసిన నాకు మళ్లీ ఒక ఆలోచన ప్రారంభమయింది. ఈ వయసులో మనం చదువుకుని ఏం ఉద్యోగాలు చేస్తాం..సినిమాస్టార్‌లకు ఇంత క్రేజీ ఉంటుందా? నేనూ ఒకప్పుడు సినిమానటినే కదా? అనుకున్నాను.
నాలో అణచబడి ఉన్న కళాపిపాస పైకి లేచింది. ఇదే విషయాన్ని మా వారితో చెప్పాను. వారు ససేమిరా కాదన్నారు. సరే బాబును మా అమ్మ చూసుకుంటూ ఉండడంతో, నేను సినిమాల్లో కాకపోయినా ఏదైనా ఉద్యోగమైనా చేద్దామనుకున్నాను. వరల్డ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌లో రిసెప్షనిస్టుగా చేరాను. అలా ఆ అంతఃపురం నుంచి బయటపడి ప్రపంచాన్ని చూశాను. ఆ సమయంలోనే నా జీవితం కొద్దిపాటి ఊహించలేని మలుపు తిరిగింది. రాజావారి చేతికి ఎముక లేకపోవడం వల్ల కుటుంబం ఆర్థికపరమైన ఒడిదుడుకులకు లోనైంది. గడవడం కొంచెం కష్టమయ్యింది. ఆస్తిపాస్తులన్నీ కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్నాయి. ఇంచుమించు దిక్కుతోచని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో రుష్యేంద్రమణిగారు నాకు చాలా ఓదార్పునిచ్చారు.

దర్శకుడు 'అశోక్'
హ్యాపీడేస్
హ్యాపీడేస్
చిరంజీవి ఫాన్స్ అంతా నా ఫాన్సే!
'రేపటి పౌరులు' చిత్రంలో బాలనటుడిగా తెరంగేట్రం చేసిిన అశోక్ కాస్త పెద్దయ్యాక ఇంజనీరింగ్ పట్టాతో పాటు 'కొరియోగ్రాఫర్' అవతారమెత్తారు. వరసపెట్టి 60 డాక్యుమెంటరీలు తీయడమే కాక 'ఉషోదయం' అనే పిల్లల చిత్రానికి గాను 2007లో ఉత్తమ దర్శకుడిగా జ్యూరీ నంది పురస్కారం కూడా అందుకున్నారు. 'ఫ్లాష్ న్యూస్', 'ఆకాశరామన్న' చిత్రాల తర్వాత 'పిల్ల జమిందార్'తో అందరి దృష్టిలో పడ్డారు. త్వరలో 'సుకుమారుడు'గా దర్శనమివ్వబోతున్న ఆ నవ దర్శకుడు చెబుతున్న హ్యాపీడేస్ ఇవి.
కాలేజీలో ప్రవేశించే నాటికే నేనొక బుల్లి సెలబ్రిటీని. అప్పటికే కొన్ని వందల డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడంతో పాటు రేపటి పౌరులు, నవభారతం, గడుగ్గాయ్ లాంటి కొన్ని సినిమాల్లో బాలనటుడిగా నటించేశా. అదీగాక ఒంగోల్లో జరిగే ప్రతి ఫంక్షన్‌లో నా డాన్స్ విధిగా ఉండాల్సిందే. చిరంజీవిగారి డాన్స్‌లు చేసి చేసి 'జూనియర్ చిరంజీవి'గా మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. ఈ డాన్స్‌ల్లో మునిగి ఎక్కడ ఫెయిలైపోతానో అని అమ్మ భయం. కళలు కూడు పెట్టవని కొందరు శ్రేయోభిలాషులు చెవిలో ఇల్లుగట్టుకుని పోరేసరికి మెల్లగా మునిసిపల్ హైస్కూల్ నుండి నా 'సీటు' కదిపి పదో తరగతికి 'నాగార్జున రెసిడెన్షియల్'లో వేశారు. ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదవాల్సి వచ్చింది.
చెల్లి ఫోర్జరీతో గుంజీళ్లు తప్పేవి
రెసిడెన్షియలైనా ఇంటినుండే కాలేజీకి వెళ్తుండేవాణ్ణి. మన అడ్డా ఎక్కువగా శ్రీనివాస్+ శ్రీదేవి జంట థియేటర్ల దగ్గరో, రత్నమహల్ వద్దో ఉండేది. చిన్నప్పుడు మా చెల్లి అరుణతో పాటు కూచిపూడి, భరతనాట్యం, కథక్ నేర్చుకోవడం వల్ల డాన్స్ నా ఆరోప్రాణం అయింది. ముఖ్యంగా చిరంజీవిగారి స్టెప్స్ అంటే పడి చచ్చేవాణ్ణి. సినిమా పిచ్చితో రాత్రుళ్లు సెకండ్ షోలు చూసి ఆలస్యంగా నిద్రలేవడం, లేటయినప్పుడల్లా తెలివిగా కాలేజీకి టి.వి.ఎస్ బండి వేసుకెళ్లి దారిలో బండి రిపేరొచ్చిందని అబద్దాలు చెప్పడం ... రోజూ రిపేర్లేమిట్రా అని మా లెక్చరర్స్ విస్తుపోవడం ... ఇలా నడుస్తుండేది. ఒక్కోసారి పూర్తిగా డుమ్మా కొట్టేసేవాణ్ణి.
అందుకుగాను నాన్నతో లెటర్ రాయించి తీసుకు వెళ్లాల్సి వచ్చేది. ఫోర్జరీ చేయడంలో మా చెల్లిది అందెవేసిన చెయ్యి. 'ఇస్నోఫీలియా వల్ల మా అబ్బాయి నిన్న రాలేకపోయా'డని నాన్న సంతకంతో లెటర్ తయారుచేసి నన్ను ఒడ్డున పడేసేది. లేదంటే అమ్మాయిల ముందే గుంజీళ్లు తీయాల్సి వచ్చేది. ఇంట్లో ఈ వేషాలన్నీ కనిపెట్టారో ఏమో-ఇంటర్ సెకండియర్‌కి అద్దంకి వెళ్లేదారిలో గుళ్లాపల్లి దగ్గర ఉండే 'నాగభైరవ రెసిడెన్షియల్' కాలేజిలో చేర్పించారు. మనం ఆడిందే ఆటగా పాడిందే పాట గా సాగిన జీవితం ఒక్కసారి దారితప్పినట్టు అనిపించింది. మనసుంటే మార్గం ఉంటుందనే తత్వం బాగా వంటబట్టినవాణ్ణి కాబట్టి మెల్లగా దారులు వెతకడంలో నిమగ్నమయ్యా.
వీరబాబుగార్కి దొరికిపోయాం
ముందుగా మస్తాన్ అనేవాణ్ణి మిత్రుడిగా చేసుకున్నా. ఎంచేతంటే వాడు అప్పటికే మూడేళ్లుగా అక్కడే చదువుతున్నాడు. కాలేజీ లూప్‌హోల్సన్నీ బాగా తెలిసినవాడు. ఏ వేళప్పుడు, ఏ దారిగుండా బయటకి పారిపోవొచ్చో చెప్పేవాడు. మా కాలేజీ నుండి ఒంగోలు అరగంట ప్రయాణమే కాబట్టి తప్పించుకుని మెయిన్‌రోడ్ ఎక్కేసి ఏ లారీనో పట్టుకుని సినిమాకు చెక్కేసేవాళ్లం. ఒకరోజు 'కొదమసింహం' సినిమా చూసి మెల్లగా గోడ దూకబోతుండగా ఎదురుగా మా కరస్పాండెంట్ వీరబాబుగారు వీర లెవల్లో నిల్చుని చూస్తున్నారు. మా పై ప్రాణాలు పైనే ఉష్ ... శిక్ష తప్పలేదనుకోండి. కొన్నాళ్లు బుద్ధిమంతుడిలా ఉన్నా. కానీ చిరంజీవిగారి సినిమా నన్ను నిలవనిచ్చేది కాదు. అలవాటు పడ్డ ప్రాణం కదా! వాచ్‌మేన్‌కు ఐదో, పదో సమర్పించి చెక్కేస్తుండేవాళ్లం.
మూడు నెలలు తప్పించుకు తిరిగా
డాన్స్ బ్రహ్మాండంగా చేస్తానని తెలిసి కొందరు అమ్మాయిలకి డాన్స్ నేర్పించమని ఆర్డర్ వేసి మగపురుగైనా వెళ్లలేని లేడీస్ హాస్టల్లోకి నన్ను పంపేవారు. ఆ క్రమంలో తక్కువ కాలంలోనే అందరి నోళ్లలో నాలుకైపోయా. ఆ ఏడాది డిసెంబర్ 31కి నేను కంపోజ్ చేసిన ఐటమ్ సాంగ్స్ పెట్టించారు. ఆ మర్రోజే నాన్న బర్త్‌డే కాబట్టి ఎంత రాత్రయినా ఇంటికి వెళ్లాలనే తొందర్లో అటూ ఇటూ తిరుగుతున్నాను. ప్రోగ్రాం అయినవెంటనే ఒకమ్మాయి వచ్చి నా చేతికి గులాబి పువ్వుతోపాటు 'గ్రీటింగ్' ఇచ్చింది. బహుశా నన్ను అభినందిస్తున్నదేమోనని విప్పి చూసి తెల్లబోయా. అదొక ప్రేమలేఖ. చెమటలు పట్టేశాయి. గబగబ జేబులో కుక్కేసి, కంగారుగా టాయిలెట్ రూమ్‌కు పరిగెత్తి సాంతం చదివా. ఈ విషయం లీకైతే తాట వలిచేస్తారని 3 నెలల వరకు ఆ అమ్మాయిని తప్పించుకుని తిరిగానంటే నమ్మండి.
చిలిపి చేష్టలు తారాస్థాయిలో ఉండేవి
బాత్రూమ్‌లు తక్కువ ఉండడంతో ఆరుబయట పెద్ద తొట్టి పెట్టి దాన్నిండా నీళ్లు పోసి ఉంచేవారు. అక్కడ చచ్చినా స్నానం చేసేవాణ్ణి కాదు. 'తొట్టి'గ్యాంగ్ మాత్రం అక్కడే జలకాలాడేది. స్టడీ అవర్ రాత్రి 8 గంటలకి మొదలయ్యేది. ఆలోపు స్నానం చేసి పరిగెత్తాలి. బాత్రూంలో ముందుగా స్నానం చేయడం ఎలా అనే ఐడియా వేసి సబ్బులన్నీ కలిపేసేవాణ్ణి. ఎవరి సబ్బు వాళ్లు ఏరుకునే లోగా నా స్నానం అయిపోయేది. కొంటె పనులకు కొదవుండేది కాదు. కుమార్ అనేవాడు స్నానం చేస్తుంటే వాడి టవల్‌ని దాచేసేవాళ్లం. దాంతో వాడు బాగా చీకటి పడ్డాక ఆదిమానవుడి అవతారంలో బాత్రూం నుండి దొంగలా బయటకి వచ్చేవాడు. స్టడీ అవర్‌కి వాడెందుకు లేట్‌గా వస్తున్నాడో మాకు తప్పించి మరెవరికీ తెలియని మిస్టరీ అది.
ఒక్కోసారి కాంటీన్‌కి ముందుగా వచ్చేసి ఏం తోచక టేబుల్ మీద ఉండే సాంబారు మగ్గులో పక్కనే ఉండే ఉప్పును సాంతం ఒంపేసి ఆ మగ్గుని ఒకరికి తెలియకుండా ఒకరం టేబుల్స్ మార్చేసి... ఆ సాంబారు ముందుగా పోసుకున్న వాడి ముఖకవళికల్ని గమనించేవాళ్లం. కొన్నాళ్లకి మాలోనే ఎవరో ఉప్పు కలుపుతున్నారని పసిగట్టి స్పూను సాంబారుని తీర్థంలా చేతిలో పోసుకుని రుచి చూసి ఆ తర్వాతే అన్నంలో కలుపుకునేవారు.
ర్యాగింగ్ ర్యాగింగ్ ర్యాగింగ్
ఇంటర్మీడియట్ తర్వాత విజయవాడ దగ్గర్లోని 'కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీ'లో చేరాను. కొత్తలో ర్యాగింగ్ చేస్తారని తెలిసి చాలా భయపడిపోయాను. ఒకరోజు అనుకోకుండా 9మంది సీనియర్స్ బిలబిలమంటూ క్లాసులోకి వచ్చేసి 'చిరంజీవి ఫ్యాన్స్ ఎంతమందో చేతులెత్తండి' అన్నారు. 20 మంది ఎత్తారు. వెంటనే చిరంజీవికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వేశారు. వాళ్లు చెప్పలేకపోయేసరికి ఎండలోకి తరిమేశారు. తర్వాత బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరన్నారు - మరికొందరు చేతులెత్తారు. బాలకృష్ణ వాళ్ల అబ్బాయి పేరేంటని అడిగారు. ఎవరూ చెప్పలేకపోయేసరికి నేను చెప్పాను.
అంతే! నీవే నిజమైన బాలకృష్ణ అభిమానివని మెచ్చుకుని వచ్చే సండే 'నిప్పురవ్వ' సినిమాకి మాకందరికీ టికెట్లు తీసుకొచ్చి ఇవ్వమని ఆర్డర్ వేసి వెళ్లారు. మరోసారి మాలో కొందర్ని హాస్టల్స్‌కు తీసుకెళ్లారు. ఒక దగ్గర టూత్‌పిక్ మొదలుకుని మూడడుగుల పొడవుండే కర్రలున్నాయి. ఎవరికి ఇష్టమైన కర్రని వాళ్లని సెలక్ట్ చేసుకోమన్నారు. సెలక్ట్ చేసుకున్నవాటితో కొడతారేమోనని భయపడి మాలో ఒకడు టూత్‌పిక్ సెలక్ట్ చేసుకున్నాడు దెబ్బ తగలదు కదా అని. దాంతో హాస్టల్ కాంపౌండు చుట్టుకొలతని కొలుచుకుని రమ్మన్నారు. ఒకన్ని కర్ర పట్టుకుని తాతలా నడవమన్నారు.
చికుబుకు చికుబుకు రైలే ...
ఒకరోజు సుధాకర్ అనే మిత్రుడు కరకట్ట రోడ్డు పక్కన లూనా పైనుండి పడేయడంతో కాలికి దెబ్బతగిలి ఇంట్లోనే ఉండిపోయా. సిద్ధార్థ కాలేజీకీ మాకూ సై అంటే సై అన్నట్టు ఉండేది. ఇల్లు వెతుక్కుంటూ మా సీనియర్ 'బాబు' వచ్చి నన్ను అర్జెంటుగా తయారవమన్నాడు. కాలు నెప్పిగా ఉన్నా తప్పలేదు. బైక్‌మీద సరాసరి స్టెల్లా కాలేజీకి తీసుకెళ్లి 'నీవు ఇప్పుడు డాన్స్ చేయాలి. మన కాలేజీ తరపున కాంపిటేషన్‌లో పాల్గొనాలి' అన్నాడు. బదులు చెప్పలేక, కాలు నెప్పితోనే 'చికుబుకు చికుబుకు రైలే' పాటకి డాన్స్ చేశా. డాన్స్‌మూడ్‌లో చూసుకోలేదు ... రక్తం కారిపోతోంది. తనే కట్టుకట్టించి ఇంట్లో దింపేసి వెళ్లాడు. మూడు రోజుల తర్వాత కాలేజీకి వెళ్లా. అప్పటికే ఫ్రెండ్స్ అంతా స్వీట్స్ పంచేసుకున్నారు డాన్స్ కాంపిటేషన్‌లో కాలేజీకి ఫస్ట్ ఫ్రైజ్ వచ్చిందన్న ఆనందంలో. చూడండి ఎంత అన్యాయమో.
ప్రేమలూ - చీవాట్లూ
నా సీనియర్ ఒకమ్మాయి నాతో పాటు ప్రోగ్రామ్స్‌లో డాన్స్ చేస్తుండేది. ఒకరోజు లోన్లీగా ఉన్నప్పుడు దగ్గరకొచ్చి "నీవు లేకుండా జీవించలేను. ఒక్క అరగంటలో రిప్లయ్ ఇవ్వాలి ... అదీ పాజిటివ్‌గా'' అని బాంబు పేల్చి, చేతిలో చీటీ పెట్టేసి వెళ్లిపోయింది. ఇదెక్కడి గొడవరా బాబూ అని కంగుతిన్నాను. అదే రోజు చివరి పీరియడ్ ప్రిన్స్‌పాల్‌ది కావడంతో అతడు క్లాసుకు వస్తాడో, రాడో కనుక్కుందామని ఆ అమ్మాయి క్లాస్‌రూమ్ ముందునుండే వెళ్లాను. నేను ప్రిన్సిపాల్ గదికి వెళ్లడం ఆ అమ్మాయి చూసింది. 'ప్రేమలేఖ' విషయం చెప్పేసి ఉంటానని డిసైడ్ చేసుకుని అదే రోజు సాయంత్రం బైక్ స్టాండ్ దగ్గర పట్టుకుని నిలదీసింది. 'ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి గానీ, ప్రిన్సిపాల్‌కి కంప్లెయింట్ చేస్తావా' అని విరుచుకుపడింది. నేను ఏం చెప్పినా తను వినే స్థితిలో లేదు. పరోక్షంగా ప్రిన్సిపాల్ నన్ను రక్షించాడన్నమాట.
పోలీస్ స్టేషన్లో ఒక రాత్రి
ఒకసారి సంక్రాంతి సెలవుల్లో ఒంగోలు వెళ్లాను. ఊర్లో గాయత్రి యాగం జరుగుతోందని తెలిసి వాలంటీర్‌గా హెల్ప్ చేద్దామని అనంతభట్ల శ్రీనివాస్ అనే మిత్రుడితో కలిసి వెళ్లాను. యాగం అయ్యేసరికి రాత్రి పదకొండు దాటింది. ఇంటికి నడుచుకుంటూ బయల్దేరాం. మా వెనక తొట్టిగ్యాంగ్ వస్తోంది. కొంత కాలంగా అమ్మాయిల టీజింగ్ జరుగుతోందని నిఘా వేసి ఉంచారట పోలీసులు. మా మాటల్లోనే పెట్రోలింగ్ వ్యాన్ రావడం, మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని వ్యాన్ ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లడం క్షణాల్లో జరిగిపోయాయి. మా వెనకాల వస్తున్న గ్యాంగు పోలీసుల్ని చూడగానే చెల్లాచెదురైపోయింది కాబట్టి వాళ్లెవరూ దొరకలేదు. పోలీసులు యక్షప్రశ్నలు వేస్తుంటే అక్కడే ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ "అమ్మాయిలు వాళ్ల వెంట పడేలా ఉన్నారు కానీ, వీళ్లు అమ్మాయిల వెంట పడేలా ఉన్నారా?'' అని మమ్మల్ని తెచ్చిన పోలీసులకు చీవాట్లు పెట్టి మమ్మల్ని పంపించేసింది.
ఫైనల్ సెమిస్టర్ రాయకముందే సినిమాల్లో 'కంపోజర్ అసిస్టెంట్'గా ఛాన్స్ రావడంతో మద్రాసు వెళ్లిపోవడం, తర్వాత దాదాపు 200 పై చిలుకు సినిమా నృత్యాలకు కొరియోగ్రాఫర్‌గా చేయడం, లండన్ 'లెబియన్' యూనివర్సిటీకి వెళ్లి లాటిన్ స్టయిల్లో 'సల్సా లంబా' అనే డాన్స్ నేర్చుకుని రావడం ... తర్వాత దర్శకత్వ శాఖలో చేరిపోవడం ఒకటి తర్వాత ఒకటి జరిగిపోయాయి కానీ, అందమైన నా కాలేజీ డేస్ మాత్రం మదిలో నిశ్చలంగా మిగిలిపోయాయి.

Subscribe to:
Posts (Atom)